BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్‌లో ఈకేఏ మొబిలిటీ రెండో షోరూమ్ ప్రారంభం

Select Suryaa Now
హైదరాబాద్‌లో ఈకేఏ  మొబిలిటీ రెండో షోరూమ్ ప్రారంభం

                                 వచ్చే 18 నెలల్లో తెలంగాణవ్యాప్తంగా మరో 20 షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రణాళిక

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి :   తెలంగాణలో ఈ కే ఏ   మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల అధీకృత డీలర్ అయిన స్కెడ్  రైడ్స్  ప్రై .లి సంస్థ హైదరాబాద్‌లోని కాచిగూడలో తన రెండో షోరూమ్‌ను శుక్రవారం ప్రారంభించింది. అంబర్‌పేట ఎమ్మెల్యే  వెంకట్ కుల్లూరి ఈ షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కెడ్  రైడ్స్  ప్రై .లి మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మనోజ్ కోఠారి, రాజేందర్ కోఠారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్ కుల్లూరి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎంతో అవసరమని, పర్యావరణహిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ షోరూమ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల విక్రయాల కోసం ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించిన ఈ కే ఏ  మొబిలిటీ తాజా ఉత్పత్తి ఈకేఏ  ఏవీఐ 3ఎస్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

కారు తరహా ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్, ప్రత్యేకమైన ఏ సీ -డీ సీ  ఛార్జింగ్ సదుపాయం ఈ వాహనం ప్రత్యేకతలు. వాణిజ్య ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఛార్జింగ్ సమయ సమస్యను తగ్గించి, ఎక్కువ సమయం రోడ్లపై గడుపుతూ ఆదాయం పెంచుకునేందుకు ఈ వాహనం దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది. ఈ సందర్భంగా  పృథ్వీ రెడ్డి మాట్లాడుతూ, కాచిగూడలో ప్రారంభించిన షోరూమ్ హైదరాబాద్‌లో తమకు రెండోది అని, మొదటి షోరూమ్ కూకట్‌పల్లిలో ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే 18 నెలల్లో హైదరాబాద్‌లో మరో మూడు షోరూమ్‌లతో కలిపి మొత్తం ఐదు షోరూమ్‌లను, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో మరో 15 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 షోరూమ్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్కెడ్  రైడ్స్  ప్రై .లి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కోఠారి మాట్లాడుతూ, ఈకేఏ  మొబిలిటీ దేశంలోనే అత్యంత విస్తృతమైన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల శ్రేణిని అందిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ఈకేఏ మొబిలిటీ ఇప్పటికే 915 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌ను పొందిందని, ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే 2,500 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను విక్రయించాలని ఈ కే ఏ  మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్, పర్యావరణహిత రవాణా దిశగా రాష్ట్రం చేపడుతున్న చర్యల నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని సాధించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.