ఘనంగా భగవాన్ బిర్షముండా 151 వ జయంతి వేడుకలు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :వనవాసి కళ్యాణ పరిషత్ఆధ్వర్యంలో ఘనంగా జనజాతి గౌరవ దివస్ వేడుకలు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని 300 ఆదివాసీ గ్రామాల్లో వేడుకలు
వనవాసి కళ్యాణ పరిషత్ ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని శ్రీ నాగోబా విద్యార్థి నిలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ప్రాంత కార్యదర్శి శ్రీ వెంకటేశ్వరరావు దేశ్‌పాండే మాట్లాడుతూ, నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా జనజాతి గౌరవ దివస్ వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని 300 ఆదివాసీ గ్రామాల్లో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ వేడుకలను ప్రతి గ్రామంలో విజయవంతంగా నిర్వహించేందుకు సార్మెడీలు, గ్రామ పటేల్‌లు, సర్పంచ్‌లు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆచార్యులు సంతోష్, సూర్యభాన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.