ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా మెడ్‌ప్లస్ నూతన స్టోర్ ప్రారంభం
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :సుభాష్‌నగర్ డివిజన్ సాయిబాబానగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ స్టోర్‌ను బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం ప్రారంభించారు. రంగారావు, సురేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మందులు, ఆరోగ్య సంబంధిత సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. నూతనంగా ప్రారంభమైన మెడ్‌ప్లస్ స్టోర్ ద్వారా సాయిబాబానగర్, సుభాష్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వారాల వినోద్, డాక్టర్ హుస్సేన్, యూసుఫ్, ప్రభాకర్, గుబ్బల లక్ష్మీనారాయణ, రాజ్‌కుమార్, కోల శ్రీకాంత్ ముదిరాజ్, సత్యనారాయణ గౌడ్, అంజి ముదిరాజ్, కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.