telangana
దుబ్బ మల్లన్న కళ్యాణం, జాతర పోస్టర్ ఆవిష్కరణ
సూర్య జమ్మికుంట ;; జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం వచ్చే నెలలో జరగనున్న మల్లికార్జున స్వామి కళ్యాణం, జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ప్రణవ్ ఆవిష్కరించారు. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయంలో జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దుబ్బ మల్లన్న చైర్మెన్ రవీందర్, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.