BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి హెల్తీ రన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Select Suryaa Now
డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి హెల్తీ రన్‌  పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

 

సూర్య - పెద్దపల్లి : డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 29న నిర్వహించనున్న పెద్దపల్లి హెల్తీ రన్‌–5Kలో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. సోమవారం తన ఛాంబర్‌లో హెల్తీ రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 'యెస్‌ ఫర్‌ లైఫ్‌ – సే నో టు డ్రగ్స్‌' నినాదంతో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాను డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రన్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ ఉచితమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.