BREAKING
నల్గొండ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్.. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలి! రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించిన కట్టంగూర్ కాంగ్రెస్ నాయకులు! నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం

దళిత క్రైస్తవ యువతులపై దాడి ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Select Suryaa Now
దళిత క్రైస్తవ యువతులపై దాడి ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

                           నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. బాధితులకు రక్షణ కల్పించాలి

అంబర్ పేట్, మేజర్ న్యూస్ 6 : హైదరాబాద్‌లో ఇద్దరు దళిత క్రైస్తవ యువతులపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిందితులందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాది తిప్పరపు కీర్తి కుమార్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉజ్మా ఆషైకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు యువతులు వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డగించి, వారి సంచులను తనిఖీ చేస్తూ.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని తెలిపారు. తాము పరిచయస్తురాలిని కలవడానికి వచ్చామని యువతులు వివరణ ఇచ్చినప్పటికీ వినకుండా దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇద్దరు యువతులను బహిరంగంగా అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని వినతి పత్రంలో వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో విషయం ప్రజల దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటన అనంతరం బాధిత యువతులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఇంటి నుంచి బయటకు రావడానికి సైతం భయపడుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసిందని, ఘటనలో పాల్గొన్న మిగతా వ్యక్తులతో పాటు ప్రేరేపించిన వారిపైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తిప్పరపు కీర్తి కుమార్ మహిళా కమిషన్‌ను కోరారు. భవిష్యత్తులో మహిళలపై, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన యువతులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.