BREAKING
లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ వారణాసి తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపైనే ఫోకస్? సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్ ఆర్టీఐహెచ్ ఏపీ స్టార్టప్ ఎక్స్ చేంజ్(APEX) కార్యక్రమంలో మంత్రి లోకేష్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ.. ఆశలకు ఆసరా.. బతుకులకు భరోసా! పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు! దేవరకొండ మండలంలో 1,150 మందికి నూతన పింఛన్లు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ బత్తలపల్లిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు – ఉత్సాహంగా విద్యార్థుల పోటీలు ఎన్విడియా వివాదం: ఆలిస్ హువాంగ్ సింగపూర్‌లోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధం

చేయూత పెన్షన్ల పంపిణీ..

Select Suryaa Now
చేయూత పెన్షన్ల పంపిణీ..

అన్నపురెడ్డిపల్లిలో  చేయూత పెన్షన్ల పంపిణీ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ  ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పేదవాడి కష్టానికి భరోసా, కులవృత్తుల జీవితానికి ఆసరా, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని  తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం డబ్బు కాదని, ఒక నిరుపేద కుటుంబానికి ధైర్యం, ఒక వృద్ధుడికి భరోసా, ఒక నిరుపేద తల్లికి ఆత్మగౌరవమని పేర్కొన్నారు.నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన నాయకులు, మీడియా మిత్రులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..

సూర్య మేజర్ న్యూస్/ అన్నపురెడ్డిపల్లి..