బత్తలపల్లిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు – ఉత్సాహంగా విద్యార్థుల పోటీలు
బత్తలపల్లి (మేజర్ న్యూస్):
బత్తలపల్లి మండల కేంద్రంలోని శ్రీ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 13-11-2026 తేదీన పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నార్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు.ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం ప్రధానంగా మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, జీ.కే. (జనరల్ నాలెడ్జ్) ప్రశ్నల పోటీలుచిన్నారులందరూ ఎంతో ఉత్సాహంగా, పోటీతత్వంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం ఈ వేడుకలను ఏర్పాటు చేశారని, గెలుపొందిన విజేతలకు త్వరలో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.