BREAKING
సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష

భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

Select Suryaa Now
భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామంలో భూభారతి, రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ తో కలిసి ఆయన స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో భూ రీ-సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దీనివల్ల రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 11 రోవర్లతో పాటు, జిల్లా ఫండ్ నుంచి మరో 8 రోవర్లను కొనుగోలు చేసి మండల సర్వేయర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఉన్నవి, లేనివి కలిపి మొత్తం 78 గ్రామాల్లో రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రీ-సర్వే ద్వారా కుటుంబ గొడవలు, చుట్టుపట్టదారి వివాదాలు, నక్షాబాట తగాదాలు పూర్తిగా తొలగిపోతాయని, 'భూదార్ కార్డు' (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) ద్వారా భూ సమస్యలకు శాశ్వత మోక్షం కలుగుతుందన్నారు.
యాసంగి సాగుపై రైతులకు పలు కీలక సూచనలు చేస్తూ, సోయాబీన్ పంట తొలగింపు తర్వాత రైతులు ఎక్కువ కాలం తీసుకునే జొన్న పంట వైపు వెళ్లకుండా, తక్కువ కాలపరిమితి కలిగిన శెనగ, పెసర్లు, మినుములు, నువ్వులు వంటి తక్కువ నీటి వనరులు సరిపోయే పంటలను సాగు చేయాలని సూచించారు. దీనివల్ల పొలం ఖాళీగా ఉండటమే కాకుండా, పంట నష్టాల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అలాగే నీటి సౌకర్యం, డ్రిప్/స్ప్రింకర్లు ఉన్న రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన బంతి పూలు, టమాట లాంటి వాటిని సాగు చేస్తే ప్రభుత్వం నుంచి తగిన సబ్సిడీలు అందడంతో పాటు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రగతిశీల రైతులు ఈ పంట మార్పిడిని స్వాగతించాలని కోరారు.అనంతరం గ్రామంలోని రామాలయంలో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిష్టించిన దుర్గామాత ప్రతిమను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ రీ సర్వే పరిశీలనలో ల్యాండ్ ఏడీ సర్వే ప్రభాకర్, తహసిల్దార్ మధుసూదన్, గ్రామస్థులు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.