భారత్‌లోనే అతిపెద్ద బాక్సింగ్ సమరానికి వేళాయే: నీరజ్ గోయట్, ఆంథోనీ పెటిస్
హైదరాబాద్ మేజర్ న్యూస్: భారతదేశ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ప్రొఫెషనల్ బాక్సింగ్ ఈవెంట్‌కు తెరలేచింది. 2027 జనవరి 23న జరగనున్న భారీ పోరాటానికి ముందు ప్రముఖ భారతీయ బాక్సర్ నీరజ్ గోయట్, మాజీ యూఎఫ్సీ ఛాంపియన్ ఆంథోనీ “షోటైమ్” పెటిస్ ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలిసారిగా ముఖాముఖిగా కలిశారు.
ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్మోస్ట్ వాల్యూయబుల్ ప్రమోషన్స్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి.
జేక్ పాల్ ప్రత్యేక సందేశం – చెన్నై ఆతిథ్యంపై ఆసక్తి:
ఈ సమావేశంలో ఎంవీపీ సహ వ్యవస్థాపకుడు జేక్ పాల్ పంపిన వీడియో సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 47 సంవత్సరాల క్రితం (1980 జనవరిలో) బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చారని గుర్తు చేస్తూ, ఈ చారిత్రక పోరాటానికి చెన్నై ఆతిథ్యం ఇస్తే అద్భుతంగా ఉంటుందని జేక్ పాల్ ఆకాంక్షించారు. అయితే, ఈ భారీ పోటీకి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాలు రేసులో ఉన్నాయని, తుది వేదిక మరియు టికెటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఐపీబీఎల్ సీఈఓ అక్షర్ మాధవరం తెలిపారు.
బాక్సింగ్ రింగ్‌లో నన్ను ఎవరూ ఓడించలేరు: నీరజ్ గోయట్- ఈ సందర్భంగా నీరజ్ గోయట్ మాట్లాడుతూ.. "గతంలో టెక్సాస్ నుంచి ప్రపంచం నన్ను చూసింది, కానీ ఈసారి నా సొంత గడ్డపై నా ప్రజల ముందు ఆడబోతున్నాను. ఆంథోనీ కేజ్ ఫైటింగ్‌లో లెజెండ్ కావచ్చు, కానీ ఇది బాక్సింగ్ రింగ్. భారత్‌లో నన్ను ఎవరూ ఓడించలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.