BREAKING
కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు!

భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం..ఎం.పీ రఘునందన్ రావు..

Select Suryaa Now
భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం..ఎం.పీ రఘునందన్ రావు..

చేగుంట: మేజర్ న్యూస్::- భారతదేశం రాజ్యాంగం పై దేశ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన అవసరమని మెదక్ ఎం.పీ రఘునందన్ రావు అన్నారు. మండల కేంద్రమైన చేగుంట లోని పి ఎం సి ల పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు చల్ల లక్ష్మణ్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటోలను ఆయన ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయిన, ఆంగ్లేయుల పాలనలో ఏర్పాటుచేసిన మెకాలే విద్యా విధానం ఇంకా కొనసాగడం శోచనీయమన్నారు. ఆ విద్యా విధానానికి ఇకనైనా స్వస్తి పలకాలని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి, విధుల గురించి పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్రపతి, గవర్నర్ కొనసాగుతారని, వారి అనుమతితోనే కేంద్రంలో,రాష్ట్రంలో చట్టాలు తయారు అవుతాయని తెలిపారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల వివరాలను సేకరించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశ జాతీయ గీతం, జాతీయ గేయం లను అవమానిస్తే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ డిఇఓ రాజు చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్ మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయులు రాజేశ్వర్,రఘుపతి, రాధ, రమ,రమాదేవి, సురేందర్,మనోహర్రావు,వెంకటేష్,సరస్వతి, శ్రీవాణి, రేఖ, ఉమా, ఉమామహేశ్వరి,హిమవర్ష, సి.ఆర్. పి రమేష్, తపస్ రాష్ట్ర జిల్లా బాధ్యులు నవాజ్ సురేష్,రంగారెడ్డి,ఎల్లం, సిద్దు, బిజెపి చేగుంట మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.