BREAKING
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!.

భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు

Select Suryaa Now
భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు

* నేటి నుంచి మూడు విడతల్లో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం

* డిసెంబర్ 13న విశాఖ వేదికగా తొలి వన్డే

* మ్యాచ్ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు

* ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు

విశాఖపట్నం, మేజర్ న్యూస్: క్రికెట్ అభిమానులకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) శుభవార్త అందించింది. విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 13న భారత్–శ్రీలంక జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అభిమానుల సౌకర్యార్థం మూడు విడతల్లో టికెట్ల విక్రయాలు చేపట్టనున్నారు. నవంబర్ 30న తొలి విడత, డిసెంబర్ 6న రెండో విడత, డిసెంబర్ 9న మూడో విడత టికెట్లను విడుదల చేయనున్నారు. ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ మైదానంలో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏసీఏ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

మరో అంతర్జాతీయ క్రికెట్ పోరుకు విశాఖ వేదిక కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టికెట్ల విక్రయాలు ప్రారంభం కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.