ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత.
గన్నవరం, మేజర్ న్యూస్ : సేవా కార్యక్రమాలే లక్ష్యంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గన్నవరం శాఖ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం బుద్ధవరం రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ప్రార్థన మందిరంలో శాఖ మాసాంతర సమావేశం అధ్యక్షుడు కర్రా వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి మానవత కృష్ణా జిల్లా కోశాధికారి, చైర్మన్ మడుపల్లి బాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన సేవా కార్యక్రమాల నివేదికను సమావేశంలో సమర్పించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చించి, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా బి.ఫార్మసీ చదువుతున్న పేద విద్యార్థిని ఎన్. వర్షకు రూ.5 వేలు, బోదకాలు వ్యాధితో బాధపడుతున్న వి. సుబ్బలక్ష్మికి రూ.5 వేలు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న బడుగు పద్మావతికి రూ.5 వేలు, మధుమేహం కారణంగా కాలు తొలగించుకుని మంచానికే పరిమితమైన తోమ్మండ్రు రాంబాబుకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. పాదాలు తొలగించబడి అంధత్వంతో బాధపడుతున్న షేక్ మహబూబ్ బాషాకు రూ.3 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. మొత్తం ఐదుగురికి రూ.23 వేల విలువైన సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కో-చైర్మన్ వీసం ప్రసాదరావు, కన్వీనర్ శ్రీకాకుళపు సత్యనారాయణ, కార్యదర్శి వి.వి. కృష్ణమోహన్, కోశాధికారి పొట్లూరు రామకృష్ణారావు, ఉపాధ్యక్షుడు కొల్లి సత్య జగదీశ్వరరావు, గౌరవ సలహాదారులు ముక్కామల సుబ్బారావు, గన్నే వెంకటరావు, పువ్వల ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యార్కా రెడ్డి సంజీవరెడ్డి, ముఖ్య సభ్యులు ఉడతా రామకృష్ణ, సూరగాని వెంకటేశ్వరరావు, షేక్ ఆదామ్ వలి, పవన్ కుమార్, కూర్మాల సత్య, శ్రీనివాస కుమార్, కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ గీతంతో సమావేశం ముగిసింది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.