బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
సూర్య - పెద్దపల్లి : బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం చిల్డ్రన్స్ డే వీక్ వేడుకల్లో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్, ఫోటో ఫన్ బూత్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణకు మద్దతుగా సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై హింస, వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బాలల హక్కులు, సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, బాలల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.