BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : బొద్దున బాపూజీ

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి :  బొద్దున బాపూజీ

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గడువు పొడిగించి నందున అర్హులైన పట్టభద్రులు తమ ఓటు    నమోదు కోసం త్వరగా దరఖాస్తు చేసుకో వాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మల్కాజిగిరి కమిటీ ఎగ్జి క్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బొద్దున బాపూజీ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించే వరకు ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఇటీవల సిఈవో ప్రకటించిన నేపధ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. 
ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధారణ ఎన్నికలకు , ఎమ్మెల్సీ ఎన్నికలకు కొంత వ్యత్యాసం ఉంటుందని, ఈ ఎన్నికల్లో కేవలం డీగ్రీ లేదా తత్సమాన మూడేళ్ళ  డిప్లొమా పూర్తి చేసిన విద్యవంతులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు అన్నారు. మహబూబ్ నగర్-రంగా రెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గాలకు సంబంధించి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే, తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరుగా నమోదు చేసుకోవ డానికి విద్యావంతులు అనాశక్తత చూపడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. దీనికి కారణం ఓటరు నమోదు ప్రక్రియపై సరైన అవగాహన కల్పించక పోవడం, నమోదు కేంద్రం తెలియక పోవడమేనన్నారు. ముఖ్యం గా అందరికి అందుబాటులో వున్న వెబ్ సైటు లింకులు సరిగా పనిచేయక పోవడం కూడ ఓ కారణం కావచ్చునన్నారు. ఏది ఏమైనప్పటికీ పట్టభద్రులు తమ ఓటు విలువను గుర్తించా లని, తమ ఓటు నమోదుకు ఇంకా అవకాశం ఉన్నందున, తమకు అందుబాటులో ఉన్న ఓటరు నమోదు కేంద్రానికి వెళ్లి, త్వరగా ఓటు నమోదు చేసుకోవాలని బొద్దున బాపూజీ విజ్ఞప్తి చేశారు