అమిత్ షా కార్యక్రమానికి సరస్వతి నగర్ డివిజన్ నుంచి బయలుదేరిన నాయకులు
బీజేపీ మహా పాదయాత్రలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి సరస్వతి నగర్ డివిజన్ నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. యాకుత్‌పురా నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేందర్ బాబు యాదవ్, సరస్వతి నగర్ డివిజన్ అధ్యక్షుడు బాలు నాయక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీజేపీ జెండాలు చేతబట్టి, పార్టీ కండువాలు ధరించి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.