BREAKING
రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్...

అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన సండ్ర కలప సీజ్‌

Select Suryaa Now
అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన సండ్ర కలప సీజ్‌

మర్పల్లి, మేజర్ న్యూస్ : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని కొంసేడుపల్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన సండ్ర కలపను అటవీశాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయగా, చెట్లను నరికి ముక్కలుగా కత్తిరించి నిల్వ ఉంచిన సండ్ర కలపతో పాటు ఇతర కలప ముక్కలు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కలపకు గుర్తింపు సంఖ్యలు కేటాయించి, ప్రభుత్వ టింబర్ డిపోకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అక్రమంగా కలపను నిల్వ చేసిన అసాద్ అహ్మద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి తెలిపారు. అటవీశాఖ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా చెట్లను నరికినా, కలపను కత్తిరించి నిల్వ ఉంచినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ కిషన్ నాయక్ పాల్గొన్నారు.