BREAKING
నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం – కేసలి అప్పారావు ఈనెల 30న పోస్టల్ బ్యాలెట్ సద్విని చేసుకోవాలి "ఎంపీడీవో రవికుమార్" *మానవత్వపు.. మహా శిఖరం..! *మొహామ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు.. డిసెంబర్ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీలు.... పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి

Select Suryaa Now
మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి :  డ్వామా పీడీ విజయలక్ష్మి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శనివారం స్థానిక కలెక్టరేట్ లో శిక్షణ కార్యక్రమం జరిగింది. 
      
       మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిక్కచ్చిగా జరపాలని డ్వామా పీడీ చెప్పారు. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 30వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించాల్సి ఉందన్నారు. తదుపరి సాధారణ ఓట్లను లెక్కించారని ఆమె సూచించారు. ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు.
      
     ప్రతి ఓటు చాలా విలువైనదని డిఆర్డిఏ పిడి బి సింగయ్య చెప్పారు. బాపట్ల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కొరకు 44 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. ఒక్కొక్క టేబుల్ కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను పనిచేస్తారన్నారు. అలాంటివి నాలుగు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ముందుగా బ్యాలెట్ బాక్స్ లలో బ్యాలెట్ పత్రాలను తెరిచి, 25 ఓట్లను ఒక కట్టగా కట్టి సిద్ధం చేసుకోవాలన్నారు. కట్టలు కట్టడం పూర్తయిన పిదప ఓట్లను లెక్కించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియలో మరింత జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
          
         ఈ కార్యక్రమంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.