BREAKING
నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం – కేసలి అప్పారావు ఈనెల 30న పోస్టల్ బ్యాలెట్ సద్విని చేసుకోవాలి "ఎంపీడీవో రవికుమార్" *మానవత్వపు.. మహా శిఖరం..! *మొహామ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు.. డిసెంబర్ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీలు.... పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు

Select Suryaa Now
చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: ఎన్నికలప్పుడే కనిపించే నాయకులను కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాల్లో అండగా నిలిచే నాయకత్వానికి పట్టం కట్టాలని మాజీ ఎంపీపీ ఎల్‌.ఈ. జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. వెల్దుర్తి మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచి అభ్యర్థి ఎల్‌.ఈ. పుష్పవతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 16 వార్డుల సభ్యుల అభ్యర్థులతో కలిసి శనివారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ముందుండి స్పందించి, సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడే గుణం పుష్పవతిలో ఉందన్నారు. ఆమెను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందుతుందని పేర్కొన్నారు.పుష్పవతి సర్పంచిగా గెలిచిన వెంటనే 16 వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.గతంలో తాను జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో వెల్దుర్తి అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేస్తూ, భవిష్యత్తులోనూ గ్రామ ప్రగతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.సమావేశంలో తెదేపా నాయకులు గిడ్డయ్య, హరి, వడ్డే మహేష్‌, మాధవకృష్ణ, నాగరాజు, బోయ హరికృష్ణ, భాజపా మండల అధ్యక్షురాలు శాంతి, బోయ దేవి, వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.