BREAKING
నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం – కేసలి అప్పారావు ఈనెల 30న పోస్టల్ బ్యాలెట్ సద్విని చేసుకోవాలి "ఎంపీడీవో రవికుమార్" *మానవత్వపు.. మహా శిఖరం..! *మొహామ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు.. డిసెంబర్ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీలు.... పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు

Select Suryaa Now
పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మండలంలో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 199 మందికి గాను 97 మంది, బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 192 మందికి గాను 67 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి మొత్తం 391 మందికి గాను 164 మంది మాత్రమే పరీక్ష రాయగా, 227 మంది గైర్హాజరయ్యారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో గణపతి, బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో విజయశేఖర్ చీఫ్‌లుగా వ్యవహరించారు. పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలను ఎంఈఓలు పి. లీలారాణి, జి. సుజాత స్క్వాడ్ అధికారిణులుగా నిర్వహించారు.విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రెండు కేంద్రాల్లోనూ పరీక్షలు సజావుగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్