కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు:
బొబ్బిలి, నవంబర్ 28: మేజర్ న్యూస్: బొబ్బిలి రైల్వే అండర్ గ్రౌండ్ వద్ద ఏర్పడిన గుంతలను నూతన కౌన్సిలర్ లు స్వంత నిధులతో పూడ్చి వేయడం జరిగింది.ఈ మేరకు
బొబ్బిలి లో మల్లంపేటలో గల 28, 29 ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటి గోవింద మరియు 27వ వార్డు వైయస్సార్సీపి పార్టీ కౌన్సిలర్ పోల రమాదేవి కలిసి మల్లంపేటలో గల అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కొంతకాలం నుంచి వెళ్లే మార్గంలో గుంతలు చాలా పెద్దవిగా ఉన్నాయి. దానికి గాను చాలామంది బైక్ పై అదుపు తప్పి క్రింద
పడిపోయారు. రాత్రి వేళలలో దాన్ని గుర్తించి ఈ కౌన్సిలర్లు సొంత నిధులతో మరమ్మత్తులు చేశారు నెలరోజులు కాకముందే సొంత నిధులతో వర్క్ చేయించడంతో మల్లంపేట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.