BREAKING
జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్... సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయి గుర్తింపు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రాన్సన్ రీడ్ ఆకస్మిక మరణం.. అసలు కారణంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి నవోదయ పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన సండ్ర కలప సీజ్‌ మాజీ ఏఎస్డబ్ల్యూఓ సింహాచలం మృతికి మాజీ ఎమ్మెల్యే శంబంగి నివాళులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు శంబంగి అభినందనలు ​సిరిసిల్ల డిపో నుండి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం రెండో టెస్టులో జురెల్, సుందర్ అవాంఛిత రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజకీయ ప్రాతినిధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ది మార్గదర్శక పాత్ర: చింతకాయల విజయ్ తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు 222 ఏళ్లు రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా ఉండేందుకు బుమ్రా నో.. ముంబై ఇండియన్స్‌లో ఆసక్తికర పరిణామం సిక్సర్ల వర్షంతో టిమ్ సీఫెర్ట్ విధ్వంసం.. దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఘనవిజయం ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ ఎన్ని పరుగులు చేయాలి? రెండో టెస్టు సమీకరణం ఇదే

టీయూడబ్ల్యూజే–ఐజేయూ మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం. :

Select Suryaa Now
టీయూడబ్ల్యూజే–ఐజేయూ మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం. :
 
 
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీపీఆర్వో విష్ణువర్ధన్ కు ఆహ్వాన పత్రికలు అందజేసిన జర్నలిస్టు సంఘం నాయకులు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మహాసభల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) విష్ణువర్ధన్ ను కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసభలను నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు వివరించారు. మహాసభలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వేణుగోపాల్, అశోక్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, సభ్యుడు బోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.