సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు శంబంగి అభినందనలు
బాడంగి, (మేజర్ న్యూస్): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాడంగి మండలంలోని కోడూరు, భీమవరం గ్రామాల సర్పంచ్‌లుగా విజయం సాధించిన రెడ్డి కృష్ణమూర్తి, లక్ష్మీపతుల దాలి నాయుడు, కోడూరు గ్రామ ఎంపీటీసీలుగా గెలుపొందిన తెంటు మధుసూదనరావు, తవిటియ్యలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అభినందించి ఆశీస్సులు అందించారు.
శనివారం బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు శంబంగిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల ముఖ్య నాయకులు, విజయం సాధించిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.