BREAKING
రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్...

సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయి గుర్తింపు

Select Suryaa Now
సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయి గుర్తింపు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 ఆత్రేయపురంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల సందర్భంగా నిర్వహించే డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ (ఐకెసిఏ) అధికారికంగా ఆమోదం తెలిపినట్టు జాయింట్ సెక్రటరీ మరియు వాటర్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ బలరామ నాయుడు మరియు జిల్లా పర్యటక అధికారి అన్వార్ తెలిపినట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుని వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కలిసి వెల్లడించారు.. కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సికెఏఏపి) చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఐకెసిఏ, ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్ ను వార్షిక ఈవెంట్ గా నిర్వహించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే బండారు  ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జనవరి 13 నుండి 15 వరకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతుంది. ఇకనుండి ఈ పోటీలు ఐకెసిఏ నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయి. ఈ గుర్తింపు ద్వారా ఆత్రేయపురం ఫెస్టివల్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో డ్రాగన్ బోట్, కయాకింగ్, కెనోయింగ్ క్రీడలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచి, యువతలో క్రీడలపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.అలాగే రాబోయే బోట్ ఫెస్టివల్ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  మండల టిడిపి అధ్యక్షులు కూసంపూడి రామకృష్ణరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చా అనిల్  దండు శివ పాల్గొన్నారు