BREAKING
పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన

జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్...

Select Suryaa Now
జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్...

.
విజయనగరం మేజర్ న్యూస్: ఎం.వీ.జీ.ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (అటానమస్)కు చెందిన సీనియర్ వింగ్ ఎన్.సీ.సీ క్యాడెట్, సార్జెంట్ ర్యాంక్ పొందిన బీ.ఎల్.వీ అక్షయ జాతీయ స్థాయి ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరం–II లో పాల్గొని ప్రతిభ చాటారు. అస్సాంలోని కోక్రాఝార్లో నవంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించిన ఈ శిబిరంతో పాటు కోక్రాఝార్ ఎన్సీసీ మారథాన్–2026లోనూ ఆమె పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్కు ప్రాతినిధ్యం వహిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న 17 ఎన్.సీ.సీ డైరెక్టరేట్ల క్యాడెట్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, 10 కిలోమీటర్ల కోక్రాఝార్ ఎన్.సీ.సీ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి ఫినిషర్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఓ.సీ.ఎల్ బొంగాయిగావ్ పరిశ్రమను సందర్శించి పారిశ్రామిక రంగంపై విలువైన అవగాహన పొందారు.

ఈ సందర్భంగా ఎం.వీ.జీ.ఆర్ డైరెక్టర్  పి.ఎస్. సీతారామరాజు, ప్రిన్సిపాల్ డా. వై.ఎం.సి. శేఖర్, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు అక్షయను అభినందించారు.

ఎన్.సీ.సీ అసోసియేట్ ఆఫీసర్లు లెఫ్టినెంట్ ఎన్. మెహర్ వాసు, లెఫ్టినెంట్ ఎల్. సౌమ్య ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ విజయంతో ఎం.వీ.జీ.ఆర్ ఎన్.సీ.సీ యూనిట్కు ఎంతో గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశసేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగాలనుకునే ఇతర క్యాడెట్లకు అక్షయ సాధన స్ఫూర్తినిస్తుందని తెలిపారు.