మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు
సూర్య మంచిర్యాల: ఈ నెల 29వ,ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు చిప్పకుర్తి రాజు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన భోజనాల కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,కవులు, కళాకారులు,వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మాదిగల ఐక్యత,సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.మంచిర్యాల జిల్లా నుంచి మాదిగ నాయకులు,ప్రజలు,యువత పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.మాదిగల ఐక్యతను,సామాజిక బలాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిప్పకుర్తి రాజు విజ్ఞప్తి చేశారు.