BREAKING
మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం** **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ** తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి.. జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇడుపు కాయితం ఉల్లిపూల పాటతో ఆకట్టుకున్న సింగర్ హెనాగ్రేస్.. ప్రశంసల వర్షం రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం యే ప్రేమ్ మోల్ లియా తొలి రోజు వసూళ్లు.. ఆయుష్మాన్ ఖురానా, శర్వరి చిత్రానికి సాధారణ ఆరంభం మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం. గన్‌మాస్టర్ జీ9 తొలి రోజు వసూళ్లు.. ఆవారాపన్ 2తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్ ఘనంగా పూలే వర్ధంతి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి గొడ్డలి పెట్టు వైరల్ మీమ్స్ కోసం రాయము.. పాత్రల బలంతోనే హాస్యం పండుతుందన్న పంచాయతీ రచయిత చందన్ కుమార్ హాలీవుడ్ దిగ్గజాల కంటే మన నటుల ప్రతిభే గొప్పది.. సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు

మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు

Select Suryaa Now
మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలోని మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో కాలేజ్ డే వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాలలో చదువుకొని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

స్విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లోకేష్ ప్రసాద్, సుధా ప్రియ, బెంగళూరులోని జేఎం ఫైనాన్షియల్ డైరెక్టర్ మయూర్ కుమార్ రెడ్డి, పెద్దపంజాణి మండల ఎంఆర్ఓ రామ్మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె. కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యసాధనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా చదవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో మెలగాలని తెలిపారు.అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసం నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే వరకు ఎదురైన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెబుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీపీ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్స్ వై. ఆనంద్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్