శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టు కిట్ల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం సుబ్బారెడ్డి..
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం కమ్మ భవన్ సమీపంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం నాసా ప్రాజెక్టుల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రాజెక్టు కిట్లను పంపిణీ చేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఉమ్మడి అనంతపురం జిల్లా జోన్ ఏజీఎం సుబ్బారెడ్డి విద్యార్థులకు కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య విద్యార్థులు నాసా ప్రాజెక్టుల్లో పాల్గొని వినూత్న నమూనాలను రూపొందిస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఈ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో మొదటి బహుమతి లభించిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి మరోసారి జాతీయస్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కిట్లలో టీషర్టులు, పుస్తకాలు, పెన్నులతో పాటు ప్రాజెక్టు తయారీకి అవసరమైన సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విశ్వనాథ్, డీన్స్ భవిత, శ్రీకాంత్, కోఆర్డినేటర్ రాధాకృష్ణ, నాసా ఇన్‌ఛార్జి విద్యాసాగర్, విష్ణుప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..