అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
నర్సంపేట, మేజర్ న్యూస్, అశోక్ నగర్ గ్రామ సర్పంచ్ జాడి అచ్యుతం కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సమ్మిట్ కు ఎంపికైన తొమ్మిది మంది సర్పంచ్ లలో జాడి అచ్యుతం ఒకరు. ఈ సందర్భంగా ఆయన తన గ్రామంలో అమలు చేస్తున్న ఎలినో కార్యాచరణ ప్రణాళిక గురించి సమ్మిట్ లో వివరించారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తాను తీసుకుంటున్న చర్యలను సభ ముందు ఉంచారు.గ్రామ స్థాయిలో అచ్యుతం అందిస్తున్న సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఇది ఎంతో గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి అచ్యుతం (నేతకానీ )కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్; ప్రవీణ్ ,నర్సంపేట ,వరంగల్ జిల్లా