ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి
సూర్య,కౌటాల: మండలంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కోనేరు కోనప్ప.ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపూలే చేసిన సేవలను స్మరించుకుంటూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా వికాసం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్యావకాశాలు కల్పించాలనే ఆయన ఆశయాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.మహాత్మా జ్యోతిబా పూలే చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం మండల అధ్యక్షుడు గంగారం, ఆదె వసంతరావు, నాయకులు పాల్గొన్నారు.