BREAKING
ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు యామీ గౌతమ్ పుట్టినరోజు వేళ ఆదిత్య ధర్ భావోద్వేగ పోస్ట్.. వెకేషన్ ఫొటోలు వైరల్ కింగ్‌లో లాజిక్ పక్కనపెట్టాం.. సీరియస్ సినిమాకూ సిద్ధమేనన్న షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం పదేళ్ల వయసులో షనాయా ఫొటోపై ట్రోలింగ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహీప్ కపూర్ ఒకే రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. షైనా ఎన్‌సీ షేర్ చేసిన ఫొటోలు వైరల్

కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం

Select Suryaa Now
కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఏడుకొండల స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మేలు జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో అనేక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్న ఏడుకొండల స్వామి కరుణతో ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో అర్హులైన ప్రజలకు అందాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సర్వే జనాః సుఖినో భవంతు అనే గొప్ప భావనతో ప్రజలందరూ సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.