BREAKING
ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు యామీ గౌతమ్ పుట్టినరోజు వేళ ఆదిత్య ధర్ భావోద్వేగ పోస్ట్.. వెకేషన్ ఫొటోలు వైరల్

చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి.

Select Suryaa Now
చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి.

సూర్య న్యూస్ అద్దంకి.

ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విధిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అద్దంకి మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్ పిలుపునిచ్చారు. మాజీ రోటరీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మనవరాలు, మన్నం సాయిరాం-రచన దంపతుల కుమార్తె మన్నం తన్విత ద్వితీయ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం కాకానిపాలె MPPS ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్, చిన్నారి తన్విత చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో కదంబం మొక్కను నాటించారు. 

ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు మాట్లాడుతూ... మన్నం త్రిమూర్తులు 50 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని గుర్తుచేశారు. నాటి నుండి నేటి వరకు పాఠశాల అభివృద్ధికి నిరంతరం చేయూతనిస్తున్నారని కొనియాడారు. పాఠశాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారని, మొక్కలంటే ప్రాణంగా భావించే ఆయన తన మనవరాలి పుట్టినరోజున ఇలా మొక్కలు నాటించడం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.రోటరీ క్లబ్ ఇంచార్జి అధ్యక్షులు అలహరి హరిబాబు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం వలనే వాతావరణంలో పెను మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో జీవరాశి అల్లకల్లోలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవుడు ఇప్పటికైనా మేల్కొని వృక్ష సంపదను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైనప్పుడే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించగలమని అన్నారు.పాఠశాల ఆవరణలో బాదం, ఉసిరిక, వివిధ రకాల పూల మొక్కలను నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు బిస్కెట్లు, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే చిన్నారి తన్విత పుట్టినరోజు సందర్భంగా సింగరకొండలోని శ్రీ కోదండ రామాలయంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెక్రెటరీ కరి రామయ్య, మన్నం సాయిరాం, మన్నం రచన, మన్నం సుబ్బరావమ్మ, మల్లాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, అద్దంకి లెవీ ప్రసాద్, మల్లాది కోటేశ్వరరావు, కావూరి రఘు చందు, ఆర్కే ట్రావెల్స్ రామకృష్ణ, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు సుబ్బయ్యలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.