వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్
దుర్గి మండలంలోని ఆత్మకూరు శివారులోని శ్రీ కాశీ నాయన వృద్ధాశ్రమంలో ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గొడవర్తి శరణ్య, మాడా సాయి దినేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గి ఎస్సై బత్తుల గోపాల్ హాజరయ్యారు. ఆయన స్వయంగా వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా పేదలు, వృద్ధులకు సహాయం చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెచ్చా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమ పెద్దలు, వృద్ధులు పాల్గొన్నారు.పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి