సర్పంచ్ ఎన్నికల ఫలితంపై వైఎస్ఆర్సిపిలో అంతర్మథనం! ఓటమికి కారణాలపై సమీక్ష..
రావికమతం, నవంబర్ 28, మేజర్ న్యూస్:
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రావికమతం వైఎస్ఆర్సిపి పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఓటమికి దారితీసిన పరిస్థితులు, ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలపై అంతర్గత సమావేశం నిర్వహించేరు
శుక్రవారం రాత్రి జరిగిన ఇ సమావేశంలో గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన యువ, విద్యావంతుడైన అభ్యర్థికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.గ్రామంలో పార్టీకి అభిమానులు ఉన్నప్పటికీ, వారందరినీ ఎన్నికల సమయంలో ఏకతాటిపైకి తీసుకురావడంలో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఆత్మపరిశీలన చేసుకున్నారు . పార్టీ శ్రేణుల సమన్వయం, క్షేత్రస్థాయి ప్రచారం లోపం జరిగిందని పలువురు అభిప్రాయపడినట్లు బోగట్టా
రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచుకుని, ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడితేనే భవిష్యత్ ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయం పడినట్టు తెలిసింది ఈ ఎన్నికల ఫలితం వైఎస్ఆర్సిపికి ఒక రాజకీయ అనుభవంగా నిలుస్తుందా వేచి చూడాల్సిందే.