BREAKING
కింగ్‌లో లాజిక్ పక్కనపెట్టాం.. సీరియస్ సినిమాకూ సిద్ధమేనన్న షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం పదేళ్ల వయసులో షనాయా ఫొటోపై ట్రోలింగ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహీప్ కపూర్ ఒకే రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. షైనా ఎన్‌సీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టు కిట్ల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం సుబ్బారెడ్డి.. అబ్‌రామ్ వల్లే జెన్-జీ పదాలు తెలిశాయి.. కింగ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు 21 ఏళ్ల తర్వాత కలిసిన జగ్గారెడ్డి, హరీష్ రావు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ముగిసేవరకు అక్కడే మకాం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సమ సమాజ స్థాపనే పూలే దంపతుల ఆశయంః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ రామాయణ పార్ట్ 1 నష్టాల్లో లేదు.. రూ.1,790 కోట్ల వసూళ్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలి. వెంకటరామరాజు

సమ సమాజ స్థాపనే పూలే దంపతుల ఆశయంః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

Select Suryaa Now
సమ సమాజ స్థాపనే పూలే దంపతుల ఆశయంః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

సూర్య, తెలంగాణ,బ్యూరో ప్రతినిధిః కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, సమానత్వ సమాజ స్థాపన కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆనాటి పెత్తందారీ వ్యవస్థను, కుల వివక్షను ఎదిరిస్తూ జ్యోతిరావు పూలే దంపతులు సమాజ మార్పు కోసం విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. బాలికల విద్య కోసం అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి పాఠశాలను ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు, విద్యావకాశాలు కల్పించాలన్న పూలే దంపతుల ఆశయాలను నేటి తరానికి తెలియజేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం వారి ఆశయాలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ఆలోచనలు, సామాజిక సంస్కరణల స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.హనుమంతరావు, దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, విజయలక్ష్మి, ఇందిరా శోభన్, కేతూరి వెంకటేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.