telangana
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ముగిసేవరకు అక్కడే మకాం
హైదరాబాద్ (మేజర్ న్యూస్ ప్రతినిధి): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలకమైన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధిష్టానం, 'ఇండియా' కూటమి నేతలతో ఆయన చర్చించనున్నారు.