ఘనంగా జ్యోతిభాపూలే వర్ధంతి
• పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
• అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు - తొగరు రాజు
సూర్య, లక్షెట్టిపేట :
సంఘ సంస్కర్త, అన్ని వర్గాల వారికీ విద్యా అందించడానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిభా పూలే ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను వ్యతిరేకించారని, సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలూ, రుగ్మతలు రూపుమాపడానికి తీవ్రంగా కృషి చేశారన్నారు. వితంతు వివాహలను ప్రోత్సహించారని, బీసీలకు, దళితులకు చదువు అవసమని గుర్తించి, వారికి చదువు నేర్పి బీసీ, ఎస్సీలకు చదువు నేర్పిన మొదటి గురువని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి ఆకనపల్లి శిల్పతి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, ఉపాధ్యక్షులు బైరం లింగన్న, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, బోడరాజు ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్, గుత్తికొండ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, సీనియర్ నాయకులు దమ్మ నారాయణ, మాలెం చిన్నన్న, తొగరు ప్రభాకర్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఆవునూరి వెంకటేష్, మినుముల జనార్ధన్, అడ్లూరి దేవేందర్, మామిడి సందీప్, రాయలింగు, కుశనపల్లి రాములు, మహేష్, అడ్లురి హరీష్ తగరపు గంగయ్య, చాతరాజు రాజశేఖర్, పెండెం రాజశేఖర్, చుంచు రమేష్, చొప్పదండి రమేష్, సంతపురి కిషోర్, కోవా లక్ష్మణ్, ఆనే విశాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.