BREAKING
సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు యామీ గౌతమ్ పుట్టినరోజు వేళ ఆదిత్య ధర్ భావోద్వేగ పోస్ట్.. వెకేషన్ ఫొటోలు వైరల్ కింగ్‌లో లాజిక్ పక్కనపెట్టాం.. సీరియస్ సినిమాకూ సిద్ధమేనన్న షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం పదేళ్ల వయసులో షనాయా ఫొటోపై ట్రోలింగ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహీప్ కపూర్ ఒకే రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. షైనా ఎన్‌సీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టు కిట్ల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం సుబ్బారెడ్డి..

దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్

Select Suryaa Now
దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్

సూర్య - మానకొండూర్ :తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పేలా ఆదివారం (నవంబర్ 29) మధ్యాహ్నం 3 గంటల నుండి మానకొండూరులో నిర్వహించనున్న 'దీక్షా దివస్' బహిరంగ సభకు యువత, బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మానకొండూరులోని సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆడప శ్రీనివాస్ మాట్లాడుతూ.. మానకొండూరు గడ్డపై దీక్షా దివస్ సభ నిర్వహించడం ఎంతో గర్వకారణమని, ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్ష చారిత్రక ఘట్టమని కొనియాడారు. కేసీఆర్ చేసిన ఆ మహోన్నత త్యాగం, పోరాట ఫలితంగానే నేడు మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ, కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ దీక్షా దివస్ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభలో మండల వ్యాప్తంగా ఉన్న యువజన సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆడప శ్రీనివాస్ కోరారు.