BREAKING
ఇరుముడి 100 రోజుల వేడుక.. కార్తీక మాసంలో స్పెషల్ షోలు, పాటలతో సందడి సర్పంచ్ ఎన్నికల ఫలితంపై వైఎస్ఆర్సిపిలో అంతర్మథనం! ఓటమికి కారణాలపై సమీక్ష.. అయోధ్య రామ మందిరంలో అర్జున్ సర్జా 175వ చిత్రం ప్రారంభం.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో భారీ పాన్ ఇండియా సినిమా ఇంజినీర్ నుంచి ప్రపంచవ్యాప్త హాస్యనటుడిగా.. మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్సన్ స్ఫూర్తిదాయక ప్రయాణం పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు.. రుహానీ శర్మ పెళ్లిపై అల్లు అరవింద్ సరదా వ్యాఖ్యలు.. సక్సెస్ మీట్‌లో నవ్వులు డీలిమిటేషన్ బిల్లుపై సాయంత్రం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు గ్రామాల రీకౌంటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. పెళ్లి పేరుతో సైబర్ మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి రూ.10 లక్షల టోకరా.. ఘనంగా జ్యోతిభాపూలే వర్ధంతి దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకపై అమెరికా సైన్యం దాడి.. ఇరాన్ దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందంటూ చర్య! ఆరు సంస్థలకు రూ.5,880 కోట్ల భారీ ప్రాజెక్టులు.. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు కొత్త ఊపు! ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలపై నియంత్రణ.. సామాన్యులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కీలక చర్యలు!

డీలిమిటేషన్ బిల్లుపై సాయంత్రం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్..

Select Suryaa Now
డీలిమిటేషన్ బిల్లుపై సాయంత్రం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్..
న్యూఢిల్లీ (మేజర్ న్యూస్ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని, భవిష్యత్ కార్యాచరణను ఆయన మీడియాకు వివరించనున్నారు.

అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో 'ఇండియా' (INDIA) కూటమి పక్షాల నేతలు సమావేశమై ఈ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే, ప్రతిపక్ష కూటమి ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ బిల్లు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికనే తక్షణమే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా, డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. ఈ బిల్లు ద్వారా పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతున్నామని అధికార పక్ష నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ చేయబోయే ప్రకటనపై దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.