national
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
( లోక్‌సభ సీట్లు 850, అసెంబ్లీ సీట్లు 650కి పెంచేలా కేంద్రం ప్రతిపాదన)
న్యూఢిల్లీ (మేజర్ న్యూస్ ప్రతినిధి): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు (132వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026) ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఫార్సు చేశారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
1971 జనాభా లెక్కల ఆధారంగా 2051 సంవత్సరం వరకు (మరో 25 ఏళ్ల పాటు) ఈ సీట్ల కేటాయింపు మరియు నిష్పత్తి అమల్లో ఉండేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.