అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
బాపట్ల జిలాలోని వేమూరు, చీరాల నియోజకవర్గాలలో జరగనున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలకు పట్టిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. వేమురు నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందికి భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ నందు ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయాలలో ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు సభలో నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపారు.