రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఆరంభంలో పరిమిత ప్రేక్షకుల ఆదరణతో ప్రారంభమైనప్పటికీ, అనంతరం బాక్సాఫీస్ వద్ద రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించిన చిత్రం హనుమాన్ అంశ్. కేవలం రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విజయం వెనుక దర్శకుడు విశాల్ చతుర్వేది చేసిన 28 రోజుల దేశవ్యాప్త ప్రయాణం కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 7న తక్కువ థియేటర్లతో, ఎలాంటి భారీ ప్రచారాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తొలి రెండు వారాల్లో తక్కువ కలెక్షన్లతో నిలిచినా, ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో పుంజుకుంది.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దర్శకుడు విశాల్ చతుర్వేది, తమ బృందంతో కలిసి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో 28 రోజుల పాటు విరామం లేకుండా పర్యటించారు. వడోదరాలోని హర్ని హనుమాన్ మందిర్ నుంచి యాత్ర ప్రారంభించి, అహ్మదాబాద్‌లోని కష్టభంజన్ హనుమాన్ మందిర్ సహా పలు ఆలయాలు, ట్రస్టులు, థియేటర్లను సందర్శిస్తూ సినిమా గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆ ప్రయత్నాలతో 25 థియేటర్లతో మొదలైన ప్రదర్శనలు క్రమంగా వందలాది థియేటర్లు, వేలాది షోలకు విస్తరించాయి.
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన లక్ష్మీ నారాయణ్ శర్మ, నీమ్ కరోలీ బాబాగా ఎదిగిన తీరును భావోద్వేగంగా ఆవిష్కరించారు. శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలోని సంభాషణలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
థియేటర్లలో ఘన విజయం సాధించిన హనుమాన్ అంశ్ ఇటీవల ఓటీటీ వేదికపైనా అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువవుతుండటంతో డిజిటల్ వేదికపైనా మంచి స్పందన లభిస్తోంది.
Also Read: సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు