BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

Select Suryaa Now
ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చినిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటున్న పాలకులు విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజుల బకాయిలు మొత్తం చెల్లించే వరకు విద్యార్థి ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. విద్యార్ధులు ముందుకు ఉద్యోగాలకు కాని, ఉన్నత చదువులకు కాని వెళ్దాం అంటే ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించక విద్యార్ధుల కష్టం చెప్పతరం కాదని ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి తెలియచేశారు. శనివారం  హైదరాబాద్ మెహిదీపట్నం వద్ద వేలాది మందితో భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బి.సి కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జి. అనంతయ్య, కడారి శివ కుమార్ యాదవ్, సి. రాజేందర్, రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం ఫెడరేషన్ పర్లగోర్ల మోడీ రాందేవ్ యాదవ్,  నిఖిల్ పటేల్ నాయకత్వం వహించారు. ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రం స్థంభింపజేస్తం అని బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని  ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీముపై ఉన్న వ్యతిరేకత మార్చుకోవాలన్నారు. ఈ స్కీముపై ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలతో అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ మంత్రులతో, శాసనసభ్యులతో చర్చలు జరపాలని కోరారు. ఫీజుల స్కీము బకాయిలు ఇవ్వకపోవడంపై ఏర్పడిన గందరగోళం వలన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదువుతామనే నమ్మకం కోల్పోయింది. 30 వేల మంది విద్యార్ధులు కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. అలాగే పీజీ అడ్మిషన్ లో ముఖ్యంగా ఎంబీఏ ఎంసీఏ పీజీల్లో అడ్మిషన్లలో ప్రభుత్వ కాలేజిలోనే  50% సీట్లు భర్తీ కాలేదు. ప్రేవేట్ కాలేజీలలో 70 – 80 శాతం సీట్లు భర్తీ కాలేదు. ప్రభుత్వం అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కూడా 70వేల సీట్లు మిగిలిపోయాయి. ప్రేవేట్ కాలేజీలలో 2 లక్షల సీట్లు మిగిలి పోయాయి.  ఫీజులు కట్టే స్తోమత లేకపోవడం వలన విద్యార్ధుల అడ్మిషన్లు తీసుకోవడం లేదు. 600 కాలేజిలు మూతపడ్డాయి. ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు. అందుకే పాత పద్ధతినే యధాతధంగా కొనసాగించాలని అప్పుడే పెద కులాల విద్యార్ధులు ఉన్నత విద్యా కొనసాగిస్తారు.
కోర్సు పూర్తి చేసుకున్న వారి సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నవి. వీరు డిగ్రీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులో చదివిన పాస్ అయిన సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు పొందలేక పై చదువులకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఆర్దిక పరిస్థితి లేనివారు సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు లేక అవకాశం కోల్పోతున్నారు. దీనితో ఉన్నత చదువులు ఆపేస్తున్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజుల బకాయిలు చెల్లిస్తే కాలేజి యాజమాన్యాలు తీసుకుంటారు. తప్ప విద్యార్ధులకు ఇవ్వరని ముఖ్యమంత్రి  చేస్తున్న వాదన సరికాదు. ఫీజులు మంజూరు చేసిన తరువాత ప్రభుత్వమే ప్రతి విద్యార్ధికి మెస్సేజ్ పెట్టాలి. లెటర్స్ ద్వారా ప్రకటనల ద్వారా తెలుపాలని సూచిస్తున్నాం. పైగా ఇంకా చాల మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించక పోవడంతో సర్టిఫికెట్లు కాలేజిలలోనే యున్నవి. కొందరు అప్పులు చేసి తీసుకున్న మంజూరు చేసిన తర్వాత మెస్సేజ్ చూసిన తర్వాత వచ్చి కాలేజీలలో వసూలు చేసుకుంటారు. కాలేజి యాజమాన్యాలే స్వాహా చేస్తారానే ఉహ జనితమైన ఆలోచన. ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్న వారు 20 – 30 శాతం యుంటారు. మిగతా 70  –  80 శాతం మంది సర్టిఫికెట్లు కాలేజీలలో యున్నవి. కావున బకాయిలు ఇవ్వక తప్పదని  హెచ్చరించారు.  ఇది కేవలం తప్పించుకోవడానికి చేసే ఎత్తు గడయన్నారు. నిజంగా చిత్తశుద్ది యుంటే ప్రభుత్వ అధికారులే కాలేజీలకు వచ్చి చెక్కులు పంపిణి చేయాలన్నారు. లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపరెందుకు? ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ప్రాధాన్యత లేని అంశాలపై మాట్లాడి సమయం వృధా చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో పెట్టుకున్నారు. బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. 90% మంది ఫీజు రీయింబర్సమెంట్ పథకం పై ఆధారపడి చదువుచున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.