BREAKING
మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం. గన్‌మాస్టర్ జీ9 తొలి రోజు వసూళ్లు.. ఆవారాపన్ 2తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్ ఘనంగా పూలే వర్ధంతి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి గొడ్డలి పెట్టు వైరల్ మీమ్స్ కోసం రాయము.. పాత్రల బలంతోనే హాస్యం పండుతుందన్న పంచాయతీ రచయిత చందన్ కుమార్ హాలీవుడ్ దిగ్గజాల కంటే మన నటుల ప్రతిభే గొప్పది.. సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు దిల్‌జిత్ దొసాంజ్ కచేరీలో సన్యా మల్హోత్రా స్టేజ్ డ్యాన్స్.. సందడి చేసిన కరిష్మా కపూర్ చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం

ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు

Select Suryaa Now
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం  సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య,  విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం  ఎంఈఓ బషీర్ అహ్మద్,  ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు

 

లింగాల: ప్రత్యేక అవసరాలు గల
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా
పోటీలు ఎంతో దోహదపడతాయని సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య అన్నారు.  లింగాల
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయిలో రన్నింగ్, షాట్ పుట్పుట్, క్యారమ్స్ తదితర క్రీడా పోటీలను ఎంఈఓ బషీర్ అహ్మద్ తో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. ఈ పోటీలలో మండలంలోని వివిధ
పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా
పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పోటీలలో
విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల
చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య మాట్లాడుతూ ఈ
కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో
ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రీడాస్ఫూర్తి, సమానత్వ భావనను
పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను
వెలికితీసేందుకు ప్రోత్సాహం అందించడం
జరిగిందన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ బషీర్ అహ్మద్ అన్నారు.ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని. వారికి సమాజం నుండి సరైన పోత్సాహం అందిస్తే భవిష్యత్తులో ఎన్నో అద్భుత విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల ఆటపాటలు ఉత్సాహం తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, ఎంఈఓ బషీర్ అహ్మద్, ఇన్చార్జి హెచ్ఎం కొండయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మంగమ్మ, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు రాజా, ఫిజికల్ డైరెక్టర్ వసంత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.