BREAKING
తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి.. జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇడుపు కాయితం ఉల్లిపూల పాటతో ఆకట్టుకున్న సింగర్ హెనాగ్రేస్.. ప్రశంసల వర్షం రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం యే ప్రేమ్ మోల్ లియా తొలి రోజు వసూళ్లు.. ఆయుష్మాన్ ఖురానా, శర్వరి చిత్రానికి సాధారణ ఆరంభం మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం. గన్‌మాస్టర్ జీ9 తొలి రోజు వసూళ్లు.. ఆవారాపన్ 2తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్ ఘనంగా పూలే వర్ధంతి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి గొడ్డలి పెట్టు వైరల్ మీమ్స్ కోసం రాయము.. పాత్రల బలంతోనే హాస్యం పండుతుందన్న పంచాయతీ రచయిత చందన్ కుమార్ హాలీవుడ్ దిగ్గజాల కంటే మన నటుల ప్రతిభే గొప్పది.. సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు దిల్‌జిత్ దొసాంజ్ కచేరీలో సన్యా మల్హోత్రా స్టేజ్ డ్యాన్స్.. సందడి చేసిన కరిష్మా కపూర్ చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఘనంగా పూలే వర్ధంతి

Select Suryaa Now
ఘనంగా పూలే వర్ధంతి

నెేటిదీినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహనీయుడి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మేడిశెట్టి శేషారావు మాట్లాడుతూ  మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, సమాజంలో నెలకొన్న కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి, బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని, తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిగా తీర్చిదిద్ది మహిళా విద్యకు మార్గదర్శకంగా నిలిచారని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో చైతన్యం, సమానత్వం సాధ్యమని నమ్మి, అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు కృషి చేశారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్య, గౌరవం లభించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేడిశెట్టి సూర్యనారాయణ, ఫణి, సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.