BREAKING
ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం** **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ** తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి.. జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇడుపు కాయితం ఉల్లిపూల పాటతో ఆకట్టుకున్న సింగర్ హెనాగ్రేస్.. ప్రశంసల వర్షం రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం యే ప్రేమ్ మోల్ లియా తొలి రోజు వసూళ్లు.. ఆయుష్మాన్ ఖురానా, శర్వరి చిత్రానికి సాధారణ ఆరంభం మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం.

రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం

Select Suryaa Now
రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం

పరకాల, మేజర్ న్యూస్, రాజ్యాధికారం కోసం బీసీలు రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. శనివారం  డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి అధ్యక్షతన నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో బీసీల జనాభా 60 శాతం ఉందని అందుకు అనుగుణంగా రాజకీయ రంగంలో వాటాలను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీసీలను విస్మరిస్తున్న అన్ని పార్టీలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని శాసనసభ స్థానాల్లో బీసీల వాటాను తేల్చిన తర్వాతనే ఆయా పార్టీలకు మద్దతు పలకాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. బీసీల జనాభా తెలంగాణలో అత్యధికంగా ఉందని తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా రాజకీయ రంగంలో విద్య ఉద్యోగ రంగాలలో ప్రభుత్వాలు పార్టీలు ఎందుకు ప్రాతినిధ్యాన్ని పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ ప్రజలలో చైతన్యాన్ని కలిగించడంలో భాగంగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు పోరాటంలో భాగస్వామ్యం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంతో పాటు హుజరాబాద్ మంథని నియోజకవర్గాలలో కొద్ది రోజుల్లో సమావేశాలు నిర్వహించి బీసీలలో చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బీసీలకు అనుగుణంగా నిధుల కేటాయింపును చేయాలనే ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేసిన మోసాలను ప్రజలు ఇప్పటికైనా గమనించి ఒకతాటిపైకి వచ్చి బీసీల హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో రేపాల నరసింహారావులు. కందుకూరి వేణుగోపాల మూర్తి. తక్కల్లపల్లి బ్రహ్మచారి. నల్లెల్ల బిక్షపతి. అల్లం మధు. 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి. ఆకుల శ్రీధర్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.