మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం
సూర్య, కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతిని పురస్కరించుకొని శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జీవంధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు.మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాలిసంఘం యువ నాయకులు పాల్గొన్నారు.