ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలి..*
. హిందూ మతాన్ని ప్రేమిద్దాం. వరమతాలను గౌరవిద్దాం.. అయ్యప్ప స్వాములు.
చింతపల్లి మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా.: ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలని, మాల్ పట్టణం కాషాయ జెండాలతో నిండిపోవాలని గురుస్వాములు ఈడుకుల్ల. భరత్, కే. పరమేశ్వర్, మేడిశెట్టి. మోహన్ కోరారు. కాషాయ జెండా ఎగురవేసిన ప్రతి ఇంటికి శ్రీ సీతారాముల ఆశీస్సులతో ధైర్యం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయని వారు అన్నారు.
శనివారం చింతపల్లి మండల పరిధిలోని గోడుకొండ్ల గ్రామపంచాయతీలో గురుస్వామి కేశగోని .పరమేశ్వర్, చంద్రకళ ఇంటిపై కాషాయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీ పంబతి ఆంజనేయ స్వామి అంజన్న మాలధారణలో ఉన్న స్వాములతో పాటు గురుస్వామి కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఐదు నుంచి పది ఇళ్లపై కాషాయ జెండాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.
హిందూ మతాన్ని ప్రేమిద్దాం.. పరమతాలను గౌరవిద్దాం అనే సందేశంతో ముందుకు సాగాలని గురుస్వాములు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు కేశగోని పరమేశ్వర్, చంద్రకళ, మహేష్, గణేష్, శంకర్, దేశీరామ్, ప్రభాకర్, శేఖర్, వంశీ, బన్నీ, శివ తదితరులు పాల్గొన్నారుl