BREAKING
రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా ఉండేందుకు బుమ్రా నో.. ముంబై ఇండియన్స్‌లో ఆసక్తికర పరిణామం సిక్సర్ల వర్షంతో టిమ్ సీఫెర్ట్ విధ్వంసం.. దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఘనవిజయం ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ ఎన్ని పరుగులు చేయాలి? రెండో టెస్టు సమీకరణం ఇదే ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలి..* టీయూడబ్ల్యూజే–ఐజేయూ మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం. : సిరాజ్‌కు ఇది మంచి ముగింపు కాదు.. జట్టు పరిస్థితిపై అశ్విన్ ఆవేదన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులివే 16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం

Select Suryaa Now
ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం

సూర్య మంచిర్యాల : మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ అన్నారు.శనివారం బెల్లంపల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహనీయుల్లో జ్యోతిబా పూలే ప్రముఖులని కొనియాడారు.సమాజంలో నెలకొన్న ఆర్థిక,సామాజిక అసమానతలకు ప్రధాన కారణం విద్యా లోపమేనని గుర్తించి,ప్రజలందరూ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో అనేక పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు.బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పూలే చూపిన మార్గంలో నడుస్తూ విద్యావంతులు కావాలని, తమ హక్కుల సాధనతో పాటు రాజ్యాధికార సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహనీయుల పేర్లను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయే తప్ప,అణగారిన వర్గాల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో కృషి చేయడం లేదని విమర్శించారు.ప్రజలు తమ హక్కుల సాధన కోసం చైతన్యవంతులై పోరాడాలని కోరారు.విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కిరణ్,ప్రభాస్, శ్యామ్‌తో పాటు విద్యార్థులు స్వామి,అజయ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.