BREAKING
తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు 222 ఏళ్లు రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా ఉండేందుకు బుమ్రా నో.. ముంబై ఇండియన్స్‌లో ఆసక్తికర పరిణామం సిక్సర్ల వర్షంతో టిమ్ సీఫెర్ట్ విధ్వంసం.. దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఘనవిజయం ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ ఎన్ని పరుగులు చేయాలి? రెండో టెస్టు సమీకరణం ఇదే ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలి..* టీయూడబ్ల్యూజే–ఐజేయూ మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం. : సిరాజ్‌కు ఇది మంచి ముగింపు కాదు.. జట్టు పరిస్థితిపై అశ్విన్ ఆవేదన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులివే 16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు

16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు

Select Suryaa Now
16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు

సూర్య స్పోర్ట్స్ డెస్క్: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2026 సీజన్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుతో జరిగిన కీలక డెర్బీ పోరులో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున బరిలోకి దిగిన ట్రయాన్, కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం బాది టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. ఆమె మెరుపు ఇన్నింగ్స్‌తో రెనెగేడ్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా, నాకౌట్ దశకు అర్హత సాధించింది.

జంక్షన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ముందు 8 ఓవర్లలో 100 పరుగుల కఠిన లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ జట్టు కేవలం 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన క్లోయ్ ట్రయాన్, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.

కేవలం 17 బంతులు ఎదుర్కొన్న క్లోయ్ ట్రయాన్ 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 329.41 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 48 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. ఆఖరి బంతి మిగిలి ఉండగానే జట్టును ఐదు వికెట్ల తేడాతో గెలిపించిన ట్రయాన్, పాయింట్ల పట్టికలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టును మూడో స్థానంలో నిలిపి ఫైనల్స్ బెర్త్ ఖాయం చేశారు.